Maoist leader Vijja surrender
* తెలంగాణ పోలీసుల ముందు మావోయిస్టు నేత హేమల విజ్జ లొంగుబాటు ?
ఆకేరు న్యూస్, వరంగల్:
దక్షిణ బస్తర్ అడవుల్లో రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టు అగ్రనేత, మిలిటరీ వింగ్ ఇన్చార్జ్ హేమల విజ్జ అలియాస్ ఐతు లొంగిపోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డివిజనల్ కమిటీ మెంబర్ (DVCM) హోదాలో ఉన్న విజ్జతో పాటు సుమారు 23 మంది మావోయిస్ట్ లు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
* ఎవరీ విజ్జ?
2004 నుంచి నక్సల్ ఉద్యమంలో చురుగ్గా ఉంటున్న హేమల విజ్జ, మావోయిస్టుల బలమైన సైనిక విభాగమైన (PLGA (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్-1లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన మిలిటరీ వింగ్ ఇన్చార్జ్ బెటాలియన్ కార్యకలాపాల పర్యవేక్షిస్తున్నారు .
Please tell us what is wrong. Your report will be sent to the website team.
