ఆకేరు న్యూస్ డెస్క్ : కెనడాలో నివసిస్తున్న భారతీయుడు యువరాజ్ గోయల్(28) (Yuvraj Goyal)హత్యకు గురయ్యాడు, యువరాజ్ ను గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 7వ తేదీన కాల్చి చంపినట్లు కెనడా పోలీసులు తెలిపారు. యువరాజ్ స్వస్థలం పంజాబ్ లోని లుథియానా. స్టూడెంట్ వీసా పై 2019 లో కెనడాకు వెళ్ళాడు, ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కెనడియన్ పర్మినెంట్ రెసిడెంట్ హోదా లభించింది. యువరాజ్ హత్యకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతునికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
————————-