Shivunipalli students baseball selection
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జిల్లా స్థాయి బేస్ బాల్ క్రీడలలో ఎంపికలు జనగామలో నిర్వహించారు . ఈ ఎంపికలో జడ్పీహెచ్ఎస్ శివునిపల్లి పాఠశాలకు చెందిన 6 గురు విద్యార్థులు క్రీడా నైపుణ్యం, క్రీడా ప్రతిభను కనబరిచి తెలంగాణ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుసుమ రమేష్ తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారిలో గుగులోతు మధుసూదన్,
సుంకరి రుత్విక్, నునావత్ చింటూ, కొమ్మురాయల చరణ్, గుర్రం నాని, గుర్రం అనిరుధ్, గుర్రం చెర్రీ ఉన్నారు. ఈ రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలు ఈనెల 29, 30 తేదీలలో నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి లో జరుగుతాయని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కొండ రవి తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాధిక, పాఠశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షులు జొన్నల రాజేశ్వర్, యంజాల ప్రభాకర్, నాగ బండి వెంకట్ రామ్ నరసయ్య, క్రీడా పోషకులు క్రీడాదాత గోలి రాజశేఖర్, పాలకుర్తి సోమశేఖర్ క్రీడా కారులను అందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
