Telangana SSC results 2026
* నేడు మధ్యాహ్నం 2:00 PM కి
* లింక్ క్లిక్ చేసి రిజల్ట్స్ చూసుకోండి
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. షెడ్యూల్ ప్రకారం, నేడు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ (SCERT) క్యాంపస్‌లో ఉన్న గోదావరి ఆడిటోరియంలో ఈ ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది.
ఈ ఏడాది మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నాటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు రికార్డు స్థాయిలో వేగంగా ఫలితాలను సిద్ధం చేశారు.
* ఫలితాలను ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి అధికారిక వెబ్సైట్లలో ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్లు:
bse.telangana.gov.in
results.bse.telangana.gov.in
results.bsetelangana.org
school.edu.telangana.gov.in
అలాగే ఇతర పోర్టల్స్ అయిన manabadi.co.in మరియు IE Education లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి. సర్వర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి కొత్తగా మీసేవ వాట్సాప్ (8096958096) ద్వారా కూడా రిజల్ట్స్ చూసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు రిజల్ట్స్ చూసుకున్న తర్వాత తమ మార్క్స్ మెమోని ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఫలితాల్లో ఏవైనా లోపాలు ఉంటే రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
