Thatikonda Rajaiah Inspects Procurement Centers
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిలుకూరు మండలం ఫతేపూర్, గార్లగడ్డ తండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య బుధవారం సందర్శించారు. పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలలో నెలకొన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్స్, అధికారులపై మండిపడ్డారు. గత 15 రోజుల నుండి రెండు లారీలే రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫతేపూర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఫతేపూర్, బోడబండ తండా, బట్టు తండా రైతులకు గతంలో ఒక పైపు ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అది పనిచేయకపోవడంతో ఈ వేసవి కాలం పంట వేయలేదు. ఇరిగేషన్ ఎస్సీతో మాట్లాడి కొత్త ఎస్టిమేషన్ వేసి వచ్చే సీజన్ కు సాగు నీరు అందించాలని అధికారులను కోరారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాలోతు రమేష్ నాయక్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు గుగులోతు ఉమ్లా, మాజీ ఉపసర్పంచ్ వడ్లురి మమత, వెంకటేష్, రైతు సమితి అధ్యక్షులు బట్టు రెడ్డి, వార్డ్ మెంబర్ వెంకన్న, సుచిత్ర అశోక్ రైతులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
