Miss transgender contests
* విల్లుపురం వేదికగా ‘మిస్ ట్రాన్స్జెండర్’ పోటీలు..
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడులోని విళుప్పురం జిల్లాలో ఏటా ఎంతో ప్రతిష్టాత్మకగా జరిగే కూతాండవర్ ఆలయ వార్షిక ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ‘మిస్ ట్రాన్స్జెండర్’ (మిస్ కూవాగం – 2026) అందాల పోటీల్లో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచి, మెరిసే కిరీటాన్ని ముద్దాడారు.
* పోటీల వివరాలు
దక్షిణ భారత ట్రాన్స్జెండర్ల సమాఖ్య మరియు తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ మండలి సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి. ఈ వేడుకల్లో భారత్తో పాటు మలేషియా వంటి దేశాల నుండి కూడా సుమారు 40 మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం మూడు దశల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అభ్యర్థుల నడక, వస్త్రధారణ, సాధారణ జ్ఞానం మరియు సామాజిక స్పృహను పరీక్షించి విజేతలను ఎంపిక చేశారు.
* విజేతలు
మిస్ కూవాగం (విజేత): సూర్య కుట్టి (కోయంబత్తూరు)
ఫస్ట్ రన్నరప్: నిషా (మలేషియా)
సెకండ్ రన్నరప్: అనన్య (పుదుచ్చేరి)
విజేతగా నిలిచిన సూర్య కుట్టికి నిర్వాహకులు కిరీటాన్ని అలంకరించి, నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో మారుతున్న దృక్పథం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటీకి కుటుంబాల మద్దతు ఎంతో అవసరమని ఆమె ఆకాంక్షించారు. ఈ 18 రోజుల పాటు జరిగే కూవాగం ఉత్సవాలు బుధవారం జరిగే రథోత్సవంతో ముగియనున్నాయి.
