* ఛత్తిస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వండి
* ఈ నెల 15 డెడ్లైన్
* జూలై 30 వరకు గడువు కోరిన కేసీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఛత్తిస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ ఒప్పందంపై ఈనెల 15 వరకు వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy) నోటీసులు పంపారు. ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అయితే.., వివరణకు జూలై 30 వరకు సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. అంతవరకు కమిషన్ గడువు ఇస్తుందా.. లేదా అనేది చూడాలి. కాగా, ఇప్పటివరకు 25 మందికి నోటీసులు ఇవ్వగా.. అందరూ వివరణ ఇచ్చినట్లు తెలిపారు. అయితే నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే పవర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
—————–