Kerala MLA Viral Video
* వైరల్ అవుతున్న వీడియో
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: ఆనందం హద్దులు దాటితే పరువు బజారు పాలవుతుందంటారు.. కేరళలో అక్షరాల ఇదే జరిగింది.. గెలిచిన మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకు బోయిన సీనియర్ కాంగ్రెస్ నేత వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతోంది. పదేళ్ళ తర్వాత ఎల్ డీఎప్ ( LDF ) ను ఓడించి యూడిఎఫ్ ( UDF ) గెలిచింది. ఈ విజయం రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం – ఉల్లాసంతో పాటు పట్టరాని ఆనందంతో కాంగ్రెస్ నాయకులు మునిగిపోయారు. కొన్ని చోట్ల ఆనందం హద్దులు కూడా దాటింది.. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత ఇపుడు ఇబ్బంది ఎదుర్కోక తప్పడం లేదు.
* మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకుబోయిన కాంగ్రెస్ నేత
కేరళ ( KERALA ) రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. రాష్ట్రంలోని కొల్లాం ( KOLLAM ) నియోజకవర్గం నుంచి బిందు కృష్ణ ( BINDHU KRISHNA) అనే మహిళ… కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి ఘన విజయం సాధించింది. పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు బిందు కృష్ణ తిరువనంతపురం వెళ్ళింది. కేపీసీసీ (KPPCC ) కార్యాలయంలో అందరిని పరిచయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. వారంతా ఆమెను అభినందనలతో ముందుకు వెళుతున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ( CHERIAN PHILIP ) ను నమస్కారం చేస్తూ పలకరించింది. ఇంకేముంది ఆయన కూడా రెట్టింపు సంతషంతో ముందుకు వచ్చి ఆ మహిళా ఎమ్మెల్యేను సంతోషంగా నవ్వుతూ కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు.. దీంతో ఆమె నమస్కారం చేస్తూ దూరం జరగడానికి ప్రయత్నం చేసింది. ఇవేవి పట్టించుకోకుండా చెరియన్ ఆమెను తన దగ్గరికి లాక్కుంటూ కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆమె వారిస్తున్నా పట్టించుకోకుండా కౌగిలించుకోవడానికే ముందుకు జరిగాడు. దీంతో నవ్వుతూనే ఆమె బలవంతంగా విడిపించుకుని కార్యాలయం లోపలికి వెళ్ళి పోయారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియా (SOCIALMEDIA )లో చక్కర్లు కొడుతున్నారు.. ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి వి తప్పవా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.. మరికొందరు ఆనందంలో ఆయన కొంత శృతి మించాడని అంటున్నారు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు..
————————————
ఈ సంఘటన పట్ల
మీరు ఎలా ఫీలవుతున్నారో కామెంట్ చేయండి..
——————————————–
