STATION GHANPUR Ponnam Birthday Celebrations
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 59వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొలిపాక సతీష్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ దేవాలయంలో పూజారి రామానుజ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న స్వాములకు నేటి నుండి 3 రోజులకు అన్నప్రసాదం (భిక్ష) సాయంకాలం అల్పాహారం (టిఫిన్) బోజనాలను టిఫిన్లకు ఆంజనేయ స్వాములకు భోజన పదార్థాలు పండ్లు, పూజ సామాన్లు ఆంజనేయ స్వామికి చందనం పూలు కండువా పంచా మరియు 3 రోజులకు మంచినీళ్లు సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గట్టు రమేష్, నాయకులు అంబటి కిషన్ రాజు, పెసరు సారయ్య, కొండొజు వేణు, సందీప్ యాదవ్, గట్టు రంజిత్, దారం రాజు, మౌనశ్రీ తాళ్లపల్లి కుమార్, ఆంజనేయ స్వామి, గట్టు శ్రవణ్, మామిడాల వెంకటేశ్వర్లు, అమంచా మధు, గట్టు శంబులింగం, గోనెల శివ, దేశెట్టి రంజిత్, అశోక్, పొన్న అజయ్, కొలిపాక రాజేందర్ తదితరులు పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి రేణుక ఎల్లమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు
