BRS Madhu Murder Case
* సాంకేతిక అంశాలతో నిందితులను గుర్తిస్తాం
– ఎస్పీ నరసింహ
ఆకేరు న్యూస్ , నల్గొండ : బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో రాజకీయ కోణం దాగి ఉందా అన్న అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అత్యంత దారుణంగా మూడు ముక్కలుగా నరికి వేర్వేరు గోనే సంచుల్లో మూట కట్టడం వెనుక దాగి ఉన్న కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మధు హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం సూర్యాపేట ఎస్పీ నరసింహ మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో ఆ గ్రామాన్ని గతంలో రెండు మూడు సార్లు సందర్శించామని చెప్పారు.
గ్రామంలో ఇరువర్గాల మధ్య పాత కక్షలు (Enmity) ఉన్న మాట నిజమే కానీ, వారు ఎప్పుడూ ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాలేదని అన్నారు. హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న విషయాలు ఇపుడే చెప్పలేమన్నారు. గతంలో జరిగిన ఒక హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2020 లో జరిగిన హత్య కేసులో కూడా సాక్షిగా ఉన్నాడు. హత్య వెనుక ఈ కారణాలు కూడా ఉండి ఉంటాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
* నమ్మిన వారే మోసం చేశారు
చింతలపాటి మధు ను హత్య జరిగిన ప్రదేశానికి బాగా నమ్మిన వారే తీసుకెళ్ళి న వారే తీసుకెళ్ళారు.
మధు ఒంటరిగా ఉన్న సమయం చూసి దాడి చేసినట్లు కనిపిస్తోందన్నారు.
ఆయన ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి నేరం జరిగేంత వరకు ప్రతి అడుగును సాంకేతిక (Technical) ఆధారాలతో కనెక్ట్ చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ చెప్పారు.
————————————
