UPSC Prelims 2026 Guidelines Hanamkonda collector chahat bajpai
ఆకేరు న్యూస్ హనుమకొండ :
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026కు సర్వం సిద్ధమైంది. మే 24 (ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం హనుమకొండ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి స్వయంగా సందర్శించి, వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
* ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్ష రాయబోయే అభ్యర్థులు సమయం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే మెయిన్ గేట్లు మూసివేస్తారు. గేట్లు మూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదు.
* పరీక్ష సమయాలు
* ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు (గేట్లు 9:00 గంటలకే క్లోజ్ అవుతాయి)
* మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు (గేట్లు 2:00 గంటలకే క్లోజ్ అవుతాయి)
* ఇవి మీ వెంట ఉండాల్సిందే.. ఇవి తెస్తే నో ఎంట్రీ
యూపీఎస్సీ హాల్ టికెట్ ప్రింటవుట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి). పరీక్షా కేంద్రంలోకి నిషేధిత వస్తువులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు,సాధారణ గడియారాలు (Normal Watches) కూడా అనుమతించబడవు.
* హనుమకొండ సివిల్స్ ప్రిలిమ్స్ డేటా
* మొత్తం 4,075 మంది
* పరీక్ష కేంద్రాలు 10
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (సుబేదారి), సెయింట్ గాబ్రియల్ హై స్కూల్ (ఫాతిమానగర్), న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ (హంటర్ రోడ్డు), ఎస్సార్ నేషనల్ హై స్కూల్ (అడ్వకేట్స్ కాలనీ), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (వడ్డేపల్లి), శ్రీ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల (ములుగు రోడ్డు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (భద్రకాళి గుడి వద్ద), లాల్ బహుదూర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (అశోక జంక్షన్). ఈ తనిఖీల్లో కలెక్టర్‌తో పాటు యూపీఎస్సీ సెంట్రల్ ఇన్స్పెక్షన్ అధికారి శుభం గాద్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
