బజ్జీలు తయారు చేస్తున్న విజయ్ ఆంటోనీ
* హీరోయిన్ ప్రీతీ అస్రాణితో కలిసి బజ్జీలు వేసిన నటుడు..
* ‘సార్ వేసిన బజ్జీలు తినొచ్చా?’ అంటూ హీరోయిన్ సరదా వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) హైదరాబాద్‌లో సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా అమీర్‌పేటలోని (Ameerpet) ఓ హోటల్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ స్వయంగా మిర్చి బజ్జీలు (Mirchi Bajji) వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనతో పాటు హీరోయిన్ ప్రీతీ అస్రాణి (Preethi Asrani) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న ‘నాన్న కుట్టి’ (Nanna Kutty) సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన చిత్ర బృందం సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఇందులో భాగంగా అమీర్‌పేటలోని ఓ హోటల్‌కు చేరుకున్న విజయ్ ఆంటోనీ.. అక్కడ మిర్చి బజ్జీలు వేస్తూ సందడి చేశారు.
అనంతరం అక్కడున్న ప్రజలతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ బజ్జీలు వేస్తుండటాన్ని చూసిన హీరోయిన్ ప్రీతీ అస్రాణి.. ”సార్ వేసిన బజ్జీలు మనం తినొచ్చా?” అంటూ సరదాగా సెటైర్ వేశారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా నిర్వహిస్తూ విజయ్ ఆంటోనీ, ప్రీతీ అస్రాణి సందడి చేయడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.
Also Read: సెమీస్ కోసం సమరమే.. యూఏఈతో భారత్ ఢీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

