Kakatiya University Biodiversity Conference
* కాకతీయ విశ్వవిద్యాలయానికి గర్వకారణం
* తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్‌లో మెరిసిన విద్యార్థినులు
ఆకేరు న్యూస్, వరంగల్:
కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఎం.ఎస్సి బయోటెక్నాలజీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థినులు సనా మరియు అమతుల్ నూర్ తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ – 2026లో డెలిగేట్లుగా ఎంపికై ప్రతిభ కనబరిచారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశం హైదరాబాద్‌లోని దూలపల్లి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించబడింది.
విద్యార్థినులు కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన వివిధ సెషన్లు, గ్రూప్ డిస్కషన్లలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణ, పర్యావరణ అవగాహన, యువత పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో వీరి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి పాల్గొనడం ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
* అంతర్జాతీయ వేదికపై అవకాశం..
కాన్ఫరెన్స్ అనంతరం జరిగే తదుపరి ఎంపిక ప్రక్రియలో ఎంపికైతే స్వీడన్లో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం ఈ విద్యార్థినులకు దక్కనుంది. ప్రస్తుతం వారు ఆ ఎంపిక ప్రక్రియ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
* విద్యార్థినులకు అభినందనలు వెల్లువ..
ఈ సందర్భంగా స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ ఎస్తారి మామిడాల, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ రాధిక తిప్పని విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి మార్గదర్శనం అందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
