Matedu Fire Accident Farmers
* మాటేడు గ్రామంలో అగ్నిప్రమాదం
* బాధిత రైతులకు అండగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి
ఆకేరు న్యూస్, తొర్రూర్ : మాటేడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మామిడి తోట పూర్తిగా దగ్ధమై, భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత రైతులను తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని నేరుగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెబుతూ తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
* అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తాం: తిరుపతి రెడ్డి
అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడారు. ఎమ్మార్వో, హార్టికల్చర్ మరియు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి, నష్టం వివరాలను తక్షణమే నమోదు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత రైతులకు అందాల్సిన ప్రతి సహాయాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు తగిన న్యాయం జరిగేలా శాయశక్తులా కృషి చేస్తానని అధికారులను కోరారు.
* “రైతులు తమ పొలాల్లో వ్యవసాయ అవశేషాలను చెత్తాచెదారం కాల్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
* పెద్దసంఖ్యలో హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు
బాధిత రైతులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
