Ram Charan Peddi Movie Massa Massa Song
ఆకేరు న్యూస్, డెస్క్:రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో మూవీపై సంగీత పరంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ప్రెస్మీట్లతో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో నిర్వహించిన భారీ ప్రెస్మీట్లో మూవీ నుంచి మోస్ట్ అవేటెడ్ ట్రాక్ ‘మస్సా మస్సా’ పాటను విడుదల చేశారు.
* హిందీ వెర్షన్‌కే ఎక్కువ క్రేజ్..
ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనర్జిటిక్ బీట్లు, ఇన్స్పిరేషనల్ లిరిక్స్, రామ్‌చరణ్ స్టైలిష్ ప్రెజెన్స్ , ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. తెలుగు వెర్షన్‌తో పోలిస్తే హిందీ వెర్షన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హిందీ లిరిక్స్, వోకల్స్, బీట్ మిక్సింగ్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ట్రైలర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ‘పెద్ది’ టీమ్, ఇప్పుడు ‘మస్సా మస్సా’ పాటతో ప్రమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని అభిమానులు చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్ కలగలిపి రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
