Journalist Sriram Ramesh Tribute
* రేపు వర్ధన్నపేటలో అంత్యక్రియలు
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ శ్రీరాం రమేష్ హఠాన్మరణం చెందడం పట్ల వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం ఆయన శ్రీరాం రమేశ్ పార్ధీవ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జర్నలిజం వృత్తిలో నిబద్దతకు మారుపేరుగా శ్రీరాం రమేశ్ నిలిచాడని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అద్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరద రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ , టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు తదితరులు శ్రీరాం రమేశ్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ రమేశ్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రమేశ్ కుటుంబానికి అండగా నిలబడతామని హామి ఇచ్చారు.

* ఆత్మీయ సహచరున్ని కోల్పోయాం
ఢిల్లీలో గుండెపోటుకు గురై మృతి చెందిన శ్రీరాం రమేశ్ భౌతిక దేహానికి తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( 143 ) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిలుముల్ల సుధాకర్ , తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం ( IJU ) రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్ట్‌గా రమేశ్ ప్రజల పక్షం నిలిచాడన్నారు. ఆత్మీయ సహచరున్ని కోల్పోవడ చాలా బాధాకరం అన్నారు.
* రేపు వర్ధన్నపేటలో అంత్యక్రియలు
ఢిల్లీలో గుండెపోటుకు గురై మృతి చెందిన శ్రీరాం రమేశ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు రేపు ( శుక్రవారం ) ఉదయం వర్ధన్నపేటలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు, జర్నలిస్ట్ మిత్రులు హాజరయి కడసారి వీడ్కోలు తెలపాలని కోరారు.
————————————–
