Seethakka Welfare Program Mulugu
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా ములుగు మండలంలో ఇంచర్ల ఎం.ఆర్ గార్డెన్లో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క దివ్యాంగుడికి మూడు చక్రాల స్కూటీని పంపిణీ చేశారు.
కొత్తగూడ మండలం సాధిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఫుల్సం రవికిరణ్ అనే దివ్యాంగుడికి మంత్రి స్వయంగా ఈ వాహనాన్ని అందజేసి, అతనికి అండగా నిలిచారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ఆర్థిక, సంక్షేమ, పథకాలు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో సాదిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ ఆలూరి కిరణ్ కుమార్,పంచాయతీరాజ్ డైరెక్టర్
చల్ల నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు వజ్జసారయ్య,
బాణోత్ రూప్ సింగ్,మాజీ జెడ్పిటిసి పులుసం పుష్పలత తోపాటుకాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
* లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ.
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల ఎం.ఆర్ గార్డెన్లో ఆదివారం పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు.
ఆరోగ్యపరమైన ఇతర ఆపత్కాల పరిస్థితుల్లో అనారోగ్య బారిన పడిన నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
