* హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో..
ఆకేరున్యూస్, హైదరాబాద్ : మధ్యాహ్నం వరకూ ఎండ ఉన్నా.. సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వరుసగా రెండు రోజులుగా సాయంత్రం వేళ హైదరాబాద్‌లో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వాన కురుస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన ఉన్నట్లు తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకుని, కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని, దాని వల్ల రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయని విశాఖ వాతావరణం తెలిపింది.
తెలుంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్‌సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి బలపడటం వల్ల కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం వేళ్లల్లో ఎండ ఉన్నప్పటికీ..మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశముంది. మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటపుడు.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ అధికారులు సూచించారు.
————————-