* అధునాతన సాంకేతిక కేంద్రాలుగా రూపకల్పన
* రూ.2,324.21 కోట్లతో ఐటీఐల ఆధునికీకరణ
* నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగం అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కారు(Congress Governament) .. సాంకేతిక విద్య ఆధునీకరణకు కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఐటీఐ(ITI) లను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న ఐటీఐలను అన్నింటినీ ఏటీసీ(ATCs) గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) లోని 65 ఐటీఐ(ITIs) లను ఏటీసీ (ATCs) గా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (Tata Technologies Ltd) (TTL)తో పదేళ్లకుగానూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. మల్లేపల్లి (Mallepally) ఐటీఐలోని ఏటీసీలకు మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఏటీసీల్లో కొత్తగా అందుబాటులో ఉండేవి ఏంటంటే..
– ఆధునిక పరిశ్రమల్లో పనిచేసేందుకు యువతకు కావాల్సిన అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాతన సామగ్రి, సాంకేతికతను ఏర్పాటు చేస్తున్నారు.
– ఇందుకోసం 130 మంది నిపుణులను శిక్షణ ఇచ్చేందుకు టీటీఎల్ (TTL) నియమిస్తుంది.
– ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు రకాల దీర్ఘ కాల (Long term) కోర్సుల్లో, 31,200 మందికి 23 రకాల స్వల్ప కాలిక (Short term) కోర్సుల్లో శిక్షణ అందిస్తారు.
– గత పదేళ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందారు. ఈ ఏటీసీలతో రానున్న పదేళ్లలో నాలుగు లక్షల మంది శిక్షణ పొందుతారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు
ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు మొత్తం వ్యయం రూ.2,324.21 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74). ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్షణకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలకు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాలజీ హబ్) పని చేస్తాయి. ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఏటీసీలు భవిష్యత్తులో తమ సేవలను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు అందజేస్తాయి.
—————————–