Minister Seethakka Mulugu Development Works
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో సిఆర్ఆర్ 2025-26 నిధులతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపనలు చేశారు

ములుగు టౌన్ పరిధిలో జాతీయ రహదారి-163 నుండి ఎరుకలవాడ వరకు రూ.6 కోట్ల 50 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు, జాతీయ రహదారి-163 నుండి ఎస్సీ కాలనీ వరకు రూ.5 కోట్ల 75 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులతో పాటు ములుగు టౌన్ తూర్పు భాగంలో రూ.5 కోట్ల 95 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కో-ఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
