Station Ghanpur Public Health
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
సమస్యల పరిష్కారంతోపాటు ప్రజల ఆరోగ్యం ప్రధానమని స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి చాగల్లులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువలు నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సరిచేయాలని, వార్డులను శుభ్రం చేస్తూ శానిటేషన్ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కౌన్సిలర్లు కృషి చేయాలి అన్నారు.

* సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి – సిఐ వేణు
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న చాగల్లులో రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కోసం ప్రజలు అవగాహనతో నడుచుకోవాలన్నారు. రోడ్డు దాటుతున్న సెల్ ఫోన్ మాట్లాడుతూ దాటడం, వాహనాలను గమనించక రోడ్డు దాటడంతో ప్రమాదాలు జరగడం ప్రమాదానికి కారణమైన వాహనాలు తప్పించుకు పోవడం జరుగుతుందన్నారు.
ప్రమాదానికి కారణమైన వాహనాలను గుర్తించేందుకు, దొంగతనాల నివారణకు సిసి కెమెరాలు ఉపకరిస్తాయన్నారు. సమావేశంలో ప్రత్యేక అధికారి రవి కాంత్, మున్సిపాలిటీ అధికారులు సత్యం, లింగయ్య, డిటి సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు ప్రశాంత్, జ్యోతి, సుధీర్, వినోద్, కరుణాకర్, శ్రీనివాస్, శంకర్, శివకుమార్ ప్రజలు పాల్గొన్నారు.
