Vaibhav Suryavanshi Team India
ఆకేరు న్యూస్, డెస్క్: భారత క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కించుకున్న బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించే అంచున నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జట్టులో అతనికి అవకాశం లభించింది.
* ఐపీఎల్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టి
ఐపీఎల్ 2026లో అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని దూకుడు ఆటతీరు, ఒత్తిడిలోనూ నిలకడగా ఆడే సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకుంది.
* సచిన్ రికార్డుకు ప్రమాదం
భారత జట్టుకు అతిపిన్న వయసులో ఎంపికైన ఆటగాడిగా ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ పేరు నిలిచింది. 1989లో సచిన్ 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు 15 ఏళ్లకే టీమిండియా పిలుపు అందుకున్న వైభవ్ ఆ రికార్డును అధిగమించాడు.
ఇక ఐర్లాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అతి చిన్న వయసులో భారత్ తరఫున ఆడిన ఆటగాడిగా కూడా సచిన్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
* అందరి చూపు వైభవ్పైనే
15 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపిక కావడం సాధారణ విషయం కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి అరంగేట్రం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “VAIBHAV SURYAVANSHI | సచిన్ రికార్డుకు వైభవ్ ముప్పు”