Goa Boat Accident Viral Video
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
గోవా (GOA) లో ఘోర పడవ ప్రమాదం 23 మంది మృతి, 64 మంది గల్లంతు…అని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. పడవలో సామర్ధ్యానికి మించి ప్రయాణికులు పడవలో ఉండడంతో అలల వేగానికి ఊగుతున్నట్టు కనిపిస్తోంది.. ఆ వెంటనే పడవ బోల్తా పడడం .. అందులో ప్రయాణికుల ఆహా కారాలు వినిపిస్తుంటాయి.. కొంత దూరం నుంచి గట్టిగా అరుపులు వినిపిస్తుంటాయి..
ఈ పడవ ప్రమాదం(BOAT ACCIDENT) గోవాలో జరిగిందంటై సోషల్ మీడియాలో ఇపుడు జోరుగా సర్క్యులేట్ అవుతోంది.. అసలు గోవాలో అలాంటి ప్రమాదమేమి జరగలేదని గోవా అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా గోవాలో ప్రమాదం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది..
* గోవాలో కాదు.. కాంగో లో ..
నిజానికి ఈ ప్రమాదం ఆఫ్రికా ఖండంలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Democratic Republic of Congo) లోని ‘కివు సరస్సు’ (Lake Kivu) లో, గోమా (Goma) రేవు సమీపంలో 2024 అక్టోబర్ 3న జరిగింది.
278 మందికి పైగా ప్రయాణికులతో మితిమీరిన లోడ్‌తో వెళ్తున్న ఆ పడవ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ఈ విషాద ఘటనలో దాదాపు 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
* ఈ వీడియో గోవా తీరంలో జరిగిన ప్రమాదమంటూ వైరల్ కావడంతో, అప్పట్లోనే గోవా పోలీస్ (Goa Police) అధికారికంగా స్పందించింది. “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బోట్ ప్రమాదం వీడియో గోవాకు సంబంధించినది కాదు, అది ఆఫ్రికాలోని కాంగోలో జరిగింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, షేర్ చేయవద్దు” అని వారు స్పష్టం చేశారు.
————————————
