Calf Deworming Sripathipalli village
* లేగ దూడలకు నట్టల మందు పంపిణీ..
* సర్పంచ్ కర్ణాకర్ ప్రారంభం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : మూగజీవాలను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని శ్రీపతి పల్లి సర్పంచ్ నీల కర్ణాకర్ అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లిలో లేగ దూడలకు (Calf Deworming) నట్టలమందు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.
* పశువులకు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాలైన పశువులతో పాటు గొర్రెలు, మేకలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ (Calf Deworming) మందు, టీకాలు సకాలంలో వేయించి మూగజీవాలను కాపాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు మెంబర్ దిండిగాల రమేష్, వెటర్నరీ వైద్యులు గోనెల శ్రీనివాస్, జగమల్ రైతులు బర్మ రవి, సల్పాల రాజు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

