Allu Arjun Sandhya Theatre Case
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనకు సంబంధించిన కేసు విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగుతోంది. తాజాగా ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మినహా, మిగిలిన నిందితులందరూ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు.
* ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన లాయర్..
ఈ కేసులో అల్లు అర్జున్ వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో విచారణకు హాజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో బన్నీ తరపున ఆయన అడ్వొకేట్ కోర్టులో ‘ఆబ్సెంట్ పిటిషన్’ దాఖలు చేశారు.
* జూలై 6కు వాయిదా…
అల్లు అర్జున్ న్యాయవాది వాదనలు విన్న నాంపల్లి కోర్టు, తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. వచ్చే విచారణ (జూలై 6) సమయానికి అల్లు అర్జున్ ఖచ్చితంగా వర్చువల్గా కోర్టుకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానానికి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
