Nallabelly Oil Mill Accident
ఆకేరు న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఒక నూనె మిల్లులో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యంత్రంలో చేయి ఇరుక్కుపోవడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడి చేయి తెగిపడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
రంగాలపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత అనే మహిళ నూనె పట్టించుకోవడానికి స్థానిక ఆయిల్ మిల్లుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె చేయి రన్నింగ్లో ఉన్న మిషన్ బెల్టు/మిషన్లో ఇరుక్కుపోయింది. కనురెప్ప మూసి తెరిచేలోపే ఆమె చేయి తెగిపడటంతో కవిత నొప్పితో విలవిలలాడింది.
వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది, స్థానికులు మిషన్ను నిలిపివేసి బాధితురాలిని బయటకు తీశారు. తీవ్ర రక్తస్రావమవుతున్న ఆమెను మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
