Gold Price Crash Today
ఆకేరు న్యూస్, డెస్క్: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు ధరలు భారీగా పతనమవడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
* రూ.2,000 పైగా తగ్గిన బంగారం…
హైదరాబాద్ మార్కెట్లో నేడు అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,070 మేర పతనమైంది. దీంతో నిన్నటి వరకు భారీగా ఉన్న ధర ప్రస్తుతం రూ.1,45,910 కి చేరింది.
సాధారణంగా ప్రజలు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా భారీగా క్షీణించింది. నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.1,900 మేర తగ్గడంతో, ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,33,750 వద్ద పలుకుతోంది.
* రూ.5,000 మేర పతనమైన కిలో వెండి..
బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. బులియన్ మార్కెట్లో నేడు కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.5,000 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
* గమనిక..
పైన పేర్కొన్న ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లెక్కింపుల ప్రకారం ఇవ్వబడినవి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, స్థానిక ప్రాంతాలను బట్టి, అలాగే జిల్లాల్లోని జ్యువెలరీ షాపులను బట్టి ఈ ధరలలో స్వల్ప మార్పులు (జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనం) ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
