Yashaswini Reddy Bodrai Consecration
ఆకేరు న్యూస్ రాయపర్తి- మండలంలోని సూర్య తండ గ్రామంలో నిర్వహించిన దుర్గమ్మ మరియు నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని దుర్గమ్మ తల్లి
మరియు బొడ్రాయి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ.సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని.ప్రార్థించారు.గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే ఇటువంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ప్రజాప్రతినిధులకు, నిర్వాహకులు శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలోప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
