* భట్టికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు
* ఎమ్మెల్సీలను కూడా లాక్కున్నారు
* సింగరేణిని నాశనం చేసింది బీఆర్ ఎస్, బీజేపీయే
* ప్రభుత్వ సలహాదారుడు షబ్బీఆర్ అలీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపు (Party defections) లను ప్రోత్సహించింది కేసీఆరే(KCR) అని ప్రభుత్వ సలహాదారు షబ్బీఆర్ అలీ (Government Adviser Shabbr Ali) అన్నారు. ఫిరాయింపులపై బీఆర్ ఎస్(BRS) మాట్లాడితే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. హైదరాబాద్లో షబ్బీర్ అలీ (Shabbr Ali) మీడియాతో మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను (Congress MLAs), ఎమ్మెల్సీలను లాక్కున్నప్పుడు కేసీఆర్కు బాధ తెలియలేదా అని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని గుర్తు చేశారు. మండలిలో కూడా ఎమ్మెల్సీ(MLC)లను కేసీఆర్ లాక్కున్నారని వెల్లడించారు. తనకు మండలిలో హోదా లేకుండా చేశారన్నారు. ఇప్పుడున్న బాధ తమ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
సింగరేణిపై డ్రామాలు
సింగరేణి బొగ్గు గను (Singareni Coal Mines) లపై బీజేపీ(BJP), బీఆర్ ఎస్ (BRS)డ్రామాలు అడుతున్నాయని షబ్బీర్ అలీ విమర్శించారు. పదేళ్లలో సింగరేణిని నాశనం చేశారని చెప్పారు. తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి (Singareni) లో 71 వేల మంది కార్మికులు ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 21 వేలకు పడిపోయిందని వివరించారు. సింగరేణి అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు.
—————————