Social Activist Kathi Kumaraswamy Death
* అశ్రునయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు.. తరలివచ్చిన ప్రముఖులు
ఆకేరు న్యూస్, రాయపర్తి : మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన కత్తి (బైరి)సోమయ్య, T N G Os సెక్రెటరీ కత్తి రవీందర్, T N G Os జాయింట్ సెక్రెటరీ అన్న సామాజిక సేవా కార్యకర్త కత్తి కుమారస్వామి హఠాన్మరణం చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈరోజు ఆయన స్వగ్రామమైన కిష్టాపురంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఆయన అంతిమయాత్రలో గ్రామ సర్పంచ్ కొండం రంగారెడ్డి ఉప సర్పంచ్ తోట సోమనర్సయ్య, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు తొర్రుర్ యతీరాజారావు, ప్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తొర్రుర్ M E O ఎం బుచ్చయ్య, ట్రెజర్ రాములు, రాయిశెట్టి వెంకన్న, యాకుబలి, సోమరాములు, వెటర్నరీ రాము. బాలాజీ వెంకన్న. C.H.O. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నెహ్రూచంద్, వరంగల్ T N G O నుండి శ్యాం. రాజేష్. కన్నా గ్రామ అన్నివర్గాల ప్రజలు, యూత్ క్లబ్ ముఖ్య సభ్యులు పలువురు రాజకీయ నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
* అందరినీ కలుపుకుపోయే తత్వం.. మరవలేని సేవలు ..
గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఏ కార్యక్రమం జరిగినా తానే ముందుండి నడిపించే వ్యక్తిని కోల్పోయామని గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కిష్టాపురం గ్రామంలో ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతాయని కొనియాడారు.
ఊరిలో ఏ ప్రోగ్రాం అయినా, ఏ పండగైనా అందరినీ కలుపుకొని, విభేదాలను పక్కన పెట్టి దగ్గరిని కలుపుక పోయే నిస్వార్ధ తత్వం ఆయన శైలి ప్రత్యేకమైనది.
* సమస్యల పరిష్కారంలో ముందుండేవారు ..
అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ, నిస్వార్థంగా సేవ చేసిన మానవతావాది ఆయన.
ఆయన మరణవార్త విన్న పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కిష్టాపురం చేరుకొని ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కిష్టాపురం గ్రామం ఒక మంచి నాయకుడిని, నిస్వార్థ సేవకుడిని కోల్పోయిందని, ఆయన మరణం పూడ్చలేని లోటని ఈ సందర్భంగా ప్రముఖులు పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
