Sri Venkateswara Swamy Kalyanam
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం హోమం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్తలు ఆలయ అర్చకులు రవీంద్ర శర్మ, శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు, ఆలయ సిబ్బంది హోమం, కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
