DMHO Jagtial Lab Technician Recruitment 2026
* డీఎంహెచ్‌వో జగిత్యాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
* జూలై 8 వరకు దరఖాస్తులకు అవకాశం..
* ఇంటర్‌తో పాటు డిప్లొమా అర్హత
ఆకేరు న్యూస్, డెస్క్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (DMHO) గుడ్ న్యూస్ చెప్పింది.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
* పోస్టు వివరాలు, విద్యార్హతలు..
* ల్యాబ్ టెక్నీషియన్
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (MLT)లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
బీఎస్సీ (ఎంఎల్టీ), ఎంఎస్సీ (ఎంఎల్డీ) పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పిస్తారు.
అలాగే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) లేదా స్పుటం స్మియర్ మైక్రోస్కోపీ విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులకు అదనపు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
* ఎంపిక విధానం, వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్థులను మెరిట్, విద్యార్హతలు, వయోపరిమితి వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. క్వాలిఫయింగ్ పరీక్షకు 90 మార్కులు, వయోపరిమితికి 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.
* ముఖ్యమైన తేదీలు..
* దరఖాస్తుల ప్రారంభం: జూలై 1, 2026
* చివరి తేదీ: జూలై 8, 2026
* దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
