SSC Stenographer Grade C 2026 Notification
* 320 పోస్టులు.. డిసెంబర్ 8 చివరి తేదీ
* స్టెనోగ్రాఫర్ గ్రేడ్-C ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కీలక ప్రకటన విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ పోస్టుల (SSC Stenographer Grade C) భర్తీకి 2026 లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (SSC Stenographer Grade C) నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 320 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 8, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* 320 పోస్టుల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ – 287 పోస్టులు
- రైల్వే బోర్డు – 8 పోస్టులు
- ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ – 14 పోస్టులు
- ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్రాంచ్ – 8 పోస్టులు
- ఎన్నికల సంఘం – 1 పోస్టు
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ – 2 పోస్టులు
* ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల చివరి తేదీ : డిసెంబర్ 8, 2026.
శాఖాధిపతుల ద్వారా అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన చివరి తేదీ : డిసెంబర్ 22, 2026.
పరీక్ష నిర్వహణ: ఫిబ్రవరి–మార్చి 2027.
* ఎవరికి అవకాశం..
ఈ నోటిఫికేషన్ సాధారణ నిరుద్యోగ అభ్యర్థుల కోసం కాదు. అర్హత కలిగిన ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బందికి మాత్రమే ఈ శాఖాపరమైన పోటీ పరీక్షలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
* దరఖాస్తు విధానం..
అర్హులైన అభ్యర్థులు SSC అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, సర్వీస్ నిబంధనలు, ఇతర వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలి.
Also Read : ఢిల్లీ యూనివర్సిటీలో 215 అసిస్టెంట్ ఉద్యోగాలు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

