SSC Tech Recruitment 2026
* ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్!
* SSC Tech Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల..
* ఫీజు లేదు.. నెలకు రూ.56,100 స్టైపెండ్
ఆకేరు న్యూస్, డెస్క్: దేశానికి సేవ చేయాలని, భారత సైన్యంలో అధికారి హోదాలో చేరాలని కలలు కనే ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్. భారత సైన్యం SSC Tech Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 381 పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుష, మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
* SSC (Tech) పురుషులు: 350 పోస్టులు
* SSCW (Tech) మహిళలు: 31 పోస్టులు
* మొత్తం ఖాళీలు: 381
విధి నిర్వహణలో మరణించిన సాయుధ దళాల సిబ్బంది వితంతువులకు కూడా ప్రత్యేక కేటగిరీలో అవకాశం కల్పించారు.
* ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
* దరఖాస్తు తేదీలు..
* మహిళా అభ్యర్థులకు
* ప్రారంభం: జూలై 8, 2026
* చివరి తేదీ: ఆగస్టు 6, 2026
* పురుష అభ్యర్థులకు
* ప్రారంభం: జూలై 9, 2026
* చివరి తేదీ: ఆగస్టు 7, 2026
* దరఖాస్తు ఫీజు..
ఈ రిక్రూట్మెంట్కు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు పూర్తిగా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంపిక ఎలా ఉంటుంది?
భారత సైన్యం ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది.
* విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
* SSB ఇంటర్వ్యూ
* వైద్య పరీక్ష
* తుది మెరిట్ జాబితా
* జీతం ఎంతంటే?
శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది.
లెఫ్టినెంట్‌గా కమిషన్ పొందిన తర్వాత రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం లభిస్తుంది. దీనికి అదనంగా మిలిటరీ సర్వీస్ పే (MSP), అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి.
అర్హులైన అభ్యర్థులు భారత సైన్యం అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in ద్వారా నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
—————————————
