KCR Visits Himanshu Hospital
* ఏఐజీ లో మనవడికి పరామర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) హైదరాబాద్‌కు బయలుదేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన ఏఐజీ ఆస్పత్రి చేరుకున్నారు.
* మనవడికి పరామర్శ
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి కేసీఆర్ రానున్నారు. ఇటీవల కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు జిమ్‌లో వర్క్అవుట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో గాయపడినట్లుగా సమాచారం. దీంతో ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనవడి ఆరోగ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. మనవడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఏఐజీ ఆసుపత్రి పరిసరాల్లో భద్రతను పటిష్టం చేశారు.అనంతరం ఆయన తిరిగి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తారా లేక నంది నగర్ నివాసానికి చేరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
——————–
