collector chahat bajpai Devadula Land Acquisition Fast
* దేవాదుల భూసేకరణను వేగవంతం చేయండి
– కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ
* వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎస్ సంజయ్ జాజు
– హనుమకొండ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి
ఆకేరు న్యూస్ , హనుమకొండ:
జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదేశించారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, భూసేకరణ పురోగతిపై సమీక్షించారు.ఈ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. . భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
* మిగిలింది 42.34 ఎకరాలే… జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి
హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి.. జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు భూసేకరణ ప్రగతిని వివరించారు. జిల్లాలో భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంకా సేకరించాల్సి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. భూములకు సంబంధించిన రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, వివాదాల్లేకుండా త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు యంత్రాంగం కృషి చేస్తోందని వివరించారు.ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీనివాస్, సూపరింటెండెంట్ జగత్ సింగ్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
