Yashaswini Reddy VO Buildings
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని పలు గ్రామాలలో విఓ బిల్డింగ్ లకు శంకుస్థాపన.
మహిళా సంఘాలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని కేశపురం,కొలనుపల్లి, కాట్రపల్లి, కిష్టాపురం, మొరిపిరాల, కొత్తూరు, బందనపల్లి, రాయపర్తి గ్రామాలలో 10 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్న మహిళా సమైక్య భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం ద్వారానే కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మహిళలకు అవసరమైన మౌలిక వసతులు, స్వయం ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అనంతరం కొత్తూరు గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్, ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఏ ఎం సీ వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణ రెడ్డి, బిల్లా సుధీర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రావు, సమ్మయ నాయక్,సర్పంచులు గుజే సుధాకర్, రాపాక పద్మ, కొండం రంగారెడ్డి,పెద్దగాని నాగరాజు, కందికట్ల స్వప్న, భూక్య ఆక్రి, గారే సహేంద్ర, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్, ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఏ ఎం సీ వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణ రెడ్డి, బిల్లా సుధీర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రావు, సమ్మయ్య,నాయక్,సర్పంచులు గుజే సుధాకర్, రాపాక పద్మ, కొండం రంగారెడ్డి,పెద్దగాని నాగరాజు, కందికట్ల స్వప్న, భూక్య ఆక్రి, గారే సహేంద్ర,కౌడాగాని రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
