Albendazole Distribution Rayaparthy Schools
* పంపిణీ ప్రారంభించిన సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రాథమిక పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి, మెడికల్ ఆఫీసర్ డా ” అరుణ్ చంద్ర తో కలిసి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారే సహేంద్ర భిక్షపతి మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నులిపురుగుల నిర్మూలన ఎంతో అవసరమని పేర్కొన్నారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత (ఎనీమియా), పోషకాహార లోపం ఏర్పడి, వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆల్బెండజోల్ మాత్రలను 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా వేసుకోవాలని, దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు, భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, కాళ్లకు చెప్పులు ధరించడం వంటి అలవాట్ల ద్వారా నులిపురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.. మండలంలోని ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నులిపురుగుల రహిత సమాజ స్థాపనకు సహకరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఎం ఓ కత్తి రవీందర్, హెచ్ ఈ ఓ జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు గారే కృష్ణమూర్తి, కాలేజీ ప్రిన్సిపాల్ జయకుమారి, హెచ్ ఎం కమల గ్రేస్, వార్డు సభ్యులు, శ్యాంసుందర్, హెచ్ ఏ జయలత, ఎ ఎన్ ఎం రాజేశ్వరి, సరస్వతి, ఆశాలు ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
