MLA Yashaswini Reddy Condolence Visit
ఆకేరు న్యూస్,రాయపర్తి : మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి సతీమణి (భార్య ) పుష్పలిలా అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, సోమవారం వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మురళి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్యా నాయక్, గోవర్ధన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
