Rapido Rider Harassed by woman in Hyderabad
* యువతి తతంగాన్ని కెమెరాలో బంధించిన బైక్ టాక్సీ రైడర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో బైక్ టాక్సీ సర్వీస్ అందిస్తున్న ఒక ర్యాపిడో రైడర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లొకేషన్ దగ్గర డ్రాప్ చేశాక డబ్బులు అడగటమే ఆ రైడర్ చేసిన తప్పయింది. యాప్ చూపించిన ఛార్జీ ఇవ్వకుండా సదరు మహిళా కస్టమర్ అతడిని తీవ్రంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
* అసలేం జరిగిందంటే..
బాధిత రైడర్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువతి బుక్ చేసుకున్న లొకేషన్ ఆధారంగా ఆమెను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. రైడ్ పూర్తయిన తర్వాత డ్రాప్ లొకేషన్ వద్ద డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అయితే సదరు కస్టమర్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, రైడర్‌పై విరుచుకుపడింది. అతడిని అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ తీవ్రంగా వేధించింది.
* పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులు..
రైడర్ తన డబ్బుల కోసం పట్టుబట్టడంతో, సదరు యువతి రివర్స్ లో తానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. దీనికి ఏమాత్రం భయపడని ర్యాపిడో రైడర్.. “సరే రామ్మీ, పోలీస్ స్టేషన్‌కే వెళ్దాం, అక్కడ తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరాడు. అయినప్పటికీ ఆమె పోలీస్ స్టేషన్‌కు రావడానికి నిరాకరిస్తూ అక్కడే గొడవ చేస్తూ కూర్చుంది.
దీంతో సదరు యువతి చేస్తున్న తతంగాన్ని, ఆమె ప్రవర్తిస్తున్న తీరును రైడర్ తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టపడి పనిచేసే రైడర్ల పట్ల ఇలాంటి ప్రవర్తన సరికాదని, సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
