Navodaya Class 6 Admissions Open
* 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం..
* జూలై 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు..
* నవంబర్ 28న ప్రవేశ పరీక్ష
ఆకేరు న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా మామునూరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (JNVST-2027) ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను నవంబర్ 28, 2026న నిర్వహించనున్నారు.
* ఎవరు అర్హులు?
2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి ప్రవేశం కోరుతున్న అదే జిల్లాకు చెందిన నివాసి అయి ఉండాలి.
* దరఖాస్తుకు ఫీజు లేదు
నవోదయ ప్రవేశానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
