station ghanpur Power Bill Recovery Drive
* విద్యుత్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
– డిఈ సారయ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విద్యుత్ బకాయిల వసూళ్లకు డిఈ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ మునిసిపల్ పట్టణ కేంద్రంలో డిఈ బి.సారయ్య ఆదేశాలతో విద్యుత్ విజిలెన్స్ పోలీస్, ఏడిఈ పి.రణధీర్ రెడ్డి, టౌన్ ఏఈ పి.శంకర్ పర్యవేక్షణలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి విద్యుత్ బకాయిలు వసూలు చేశారు.
సబ్ డివిజన్ పరిధిలోని ఆపరేషన్ అండ్ మెంటనెన్స్ సిబ్బంది విజిలెన్స్ పీసీలతో కలిసి పది బృందాలుగా ఏర్పడి పట్టణ పరిధిలోని మోండి బకాయిల వసూళ్లకు పూనుకోవడంతో అధికారులు నిర్దేశించిన లక్ష్యం మండల పరిధిలో 23 లక్షలు కాగా ఒక్కరోజు 5 లక్షల రూపాయల బకాయిలు వసూలు చేశారు. శుక్రవారం కూడా విద్యుత్ బకాయిల వసూళ్ల పరంపర కొనసాగనుందని వినియోగదారులు సిబ్బంది తమవద్ద రాకముందే స్వంతంగా బకాయిలను తక్షణమే చెల్లించాలని అధికారులు కోరారు.
సబ్ డివిజన్ కార్యాలయంలో సిబ్బందితో విద్యుత్ భద్రతా నియమాల ప్రతిజ్ఞ చేపించిన అనంతరం (డిఈ)సారయ్య మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది పనులు నిర్వహించే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉన్నతాధికారుల అదేశాల మేరకు ‘వన్ మినిట్ రూల్’ విధానం తప్పకుండా పాటిస్తూ ప్రమాదాల బారినుండి రక్షణ పొందాలని, ఒక నిమిషం భద్రత గురించి ఆలోచన చేసి పనులు చేపట్టాలని కోరారు.
విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో ఇంటివద్ద నుంచే సులువైన మార్గాల ద్వారా చెల్లించే విధానాన్ని అలవర్చుకోవాలన్నారు.
అందుకు ఫోన్ పే, గూగుల్ పే, టీ-వ్యాలెట్, అమెజాన్, ఎన్పిడిసీఎల్ బిల్ డిస్క్ తదితర ఆన్లైన్ మాద్యమాలను ఉపయోగించి సులువుగా బిల్లులను చెల్లించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్లు సాధనా రెడ్డి, హరిత, జేఏఓ జనార్ధన్, విజిలెన్స్ పిసీలు కిరణ్, వెంకటేశ్వర్లు, లైన్ ఇన్స్పెక్టర్ ఆనంద్, లైన్మెన్లు శ్రీధర్, సురేందర్ రెడ్డి, సదన్, యుగేందర్, అన్వర్ పాషా, నాగరాజు, రాము, కుమార్, సాంభరాజు, అశోక్, వెంకటేష్, శ్రీను, సురేందర్, రాజిరెడ్డి అన్మ్యాండ్ వర్కర్స్ అశోక్, రాజు, సురేష్, రాజేందర్, సాయి, ప్రణయ్, శ్రీను, అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
