MLA KADIYAM STATION GHANPUR
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్ శివారులోని మర్రికుంట, ఊరకుంటలను గోదావరి జలాలతో నింపాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గ్రామస్తులు, మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. ఏడవ వార్డు కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని ఆయన నివాసంలో కడియం శ్రీహరిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మర్రికుంఠ, ఊరగుంట గోదావరి నీళ్ల నీళ్లతో నింపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించి ఎమ్మెల్యే ఫంక్షన్ హాల్ అభివృద్ధి కొరకు 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దలు వెంకటయ్య లక్ష్మి నారాయణ, శ్రీను, సమ్మయ్య, మల్లేష్ మత్స్య శాఖ కమిటీ అధ్యక్షులు కుమార్ కమిటీ సభ్యులు యాదగిరి, రవి, సమ్మయ్య పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
