Martyrs Bus Yatra Telangana
ఆకేరు న్యూస్, రాయపర్తి: ఆగస్టు 2 నుండి 18 వరకు జరుగు అమరుల యాధిలో బస్సు యాత్రను జయప్రదం చేయాలని కల్లుగీత కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాల బోయిన రాంబాబు గౌడ్ అన్నారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కల్లుగీత కార్మిక సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెదగొని సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమరుల యాధిలో గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన నాయకులను స్మరించుకుంటూ మహబూబాద్ జిల్లా మానుకోట నుండి ఆగస్టు 2 నుండి ప్రారంభమై బస్సు యాత్ర 18 వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ పాపన్న జయంతి రోజున హైదరాబాద్ లో ముగుస్తున్నందున ఇట్టి కార్యక్రమానికి కల్లుగీత కార్మికులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.
అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులు పులి సోమయ్య జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి నరసయ్య తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లగీత వృత్తి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు , వృత్తి లో ప్రమాదానికి గురైన కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, వృత్తి చేసే ప్రతి గీత కార్మికునికి బైకులు ఇవ్వాలని, ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
ఆగస్టు 16 నా నర్సంపేట లో ప్రారంభమై 17 సాయంత్రం రాయపర్తి వరకు వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంలో కల్లుగీత కార్మికులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం తెలిపి బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు .. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం రాయపర్తి మండల గౌరవ అధ్యక్షులు తేరాల సదానందం, వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పంతంగి వేణు, సంగెం మండల కార్యదర్శి మచ్చ గురువయ్య గౌడ్, లాబర్తి గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని రాజబాబు గౌడ్, రాయపర్తి మండల సీనియర్ నాయకులు నారగోని శ్యాం ప్రసాద్ గౌడ్, రాగన్న గూడెం సొసైటీ ఉపాధ్యక్షులు కోలా యాకయ్య గౌడ్, సంఘం నాయకులు గాజుల సుధాకర్ గౌడ్, బొమ్మెర వీరస్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు….
