Rayaparthy Buffalo Road Accident
Published:
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తు తెలియని కారు ఢీకొని పాడి గేదె మృతి చెందింది. రాయపర్తికి చెందిన మహమ్మద్ అఫ్సర్ పాషా పాడి గేదే శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో వే బ్రిడ్జి దగ్గర వరంగల్ నుండి రాయపర్తికి వైపునకు మితిమీరిన వేగంతో వస్తున్న గుర్తు తెలియని కారు అదుపుతప్పి గేదెను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ.70 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా బాధిత కుటుంబం కోరుతున్నది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
