Trainee IPS Harassment Case
* మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగిక వేధింపులు
* ప్రైవేట్ వీడియోలు తీసీ భర్తకు పంపించాడని ఆరోపణలు
అకేరు న్యూస్ ,హైదరాబాద్ : హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదైంది. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సహచర ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది. ఉదయ్ కృష్ణారెడ్డి తనకు నిరంతరం అసభ్యకరమైన మెసేజ్లు పంపుతూ, మానసికంగా వేధిస్తూ, దుర్భాషలాడుతున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.
* ప్రైవేట్ వీడియోలు తీసి..
బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెను జూలై 9వ తేదీన జుట్టుపట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి బెదిరించాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ను బలవంతంగా లాక్కొని, ఆ ప్రైవేట్ వీడియోలను ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది . అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తన భర్తకు పంపించాడని ఆమె ఆరోపించింది,
——————————–
