UDAY KRISHNA REDDY IPS ATTEMPTS SUICIDE
* పరిస్థితి విషమం – ఆస్పత్రికి తరలింపు
* లైంగిక ఆరోపణలపై నిన్న కేసు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో మరో పరిణామం చోటు చేసుకున్నది. సహచర ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
హైదరాబాద్ మోతి నగర్లో ని ఆయన బంధువుల ఇంట్లో ఉదయ్ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కాగా లైంగిక వేధింపుల కేసు సంబందించిన ఆరోపణలపై విచారించిన అకాడమి కమిటీ ప్రాథమికంగా ఆధారాలు ఉన్నట్లు తేల్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది..
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
