PM NARENDRA MODI
ఆకేరు న్యూస్, డెస్క్: పర్యావరణ హిత సాంకేతికత, సరికొత్త అంతరిక్ష విజయాలతో భారతదేశం సరికొత్త శకంలోకి అడుగుపెట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘హైడ్రోజన్’ ఇంధన రైలు దేశీయ సాంకేతిక ప్రగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగం, ఆధునిక ఆవిష్కరణల వైపు భారత్ అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
* అంతరిక్ష రంగంలో భారత యువత చరిత్ర..
భారత అంతరిక్ష రంగంలో నవశకం ప్రారంభమైందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్’ సాధించిన రాకెట్ ప్రయోగ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడం దేశానికే గర్వకారణమని కొనియాడారు. నేటి తరం యువత కేవలం సాహసాలకే పరిమితం కాకుండా, అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేస్తూ దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్నారని ప్రశంసించారు.
* ఇంధన సంక్షోభంపై ధీటైన వ్యూహం..
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడినప్పటికీ, భారత్ ఆ ప్రభావం పడకుండా సమర్థవంతంగా ఎదుర్కొంటోందని పీఎం తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన భద్రతతో పాటు ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధన వనరుల (Alternative Energy) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
