BHADRAKALI TEMPLE OFFICIALS IN WARANGAL BAN INSTA REELS AND YOUTUBE VIDEOS INSIDE THE TEMPLE
*యూట్యూబ్ వీడియోలపై ఈవో కీలక సూచనలు
ఆకేరు న్యూస్, వరంగల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల చిత్రీకరణపై పూర్తిగా నిషేధం విధించారు.ఇటీవలి కాలంలో కొంతమంది యువతీ యువకులు, క్రియేటర్లు ఆలయ ఆవరణలో సోషల్ మీడియా వీడియోల కోసం రీల్స్ చేస్తూ భక్తులకు అసౌకర్యం కలిగిస్తుండటంతో పాటు, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మికతను కాపాడేందుకే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు ఆలయ ఈవో, స్పెషల్ కమిషనర్ ఆర్. సునీత స్పష్టం చేశారు.
ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులు, సందర్శకులు ఈ నూతన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సోషల్ మీడియా రీల్స్ లేదా ఎలాంటి హంగామా వీడియోలు చిత్రీకరించవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఆలయ యాజమాన్యానికి సహకరించాలని కోరారు..

——————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
