Nekkonda SI Suspension
* సీపీ శ్వేత కఠిన నిర్ణయంపై ప్రజా హర్షం
ఆకేరు న్యూస్, వరంగల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు చేపట్టింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్వేత మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు..
నెక్కొండ ఎస్సై మహేందర్‌పై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సైపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లభించడంతో, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీపీ శ్వేత ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* నెక్కొండలో పండుగ వాతావరణం – సీపీకి అభినందనలు..
ఎస్సై మహేందర్ సస్పెన్షన్ వార్త వెలువడటంతో నెక్కొండ మండల కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం స్థానికులు నెక్కొండ ప్రధాన చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన పోలీస్ కమిషనరేట్ అధికారులకు పలువురు స్థానికులు, బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
